భారత ప్రధాన న్యాయమూర్తిగా బాబ్డే ప్రమాణ స్వీకారం
BY Telugu Gateway18 Nov 2019 4:47 AM GMT

X
Telugu Gateway18 Nov 2019 4:47 AM GMT
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ ఎ బాబ్డే సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతోపాటు అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అద్వానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ తదితరులు పాల్గొన్నారు. బాబ్డే సుప్రీంకోర్టుకు 47వ ప్రధాన న్యాయమూర్తి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన సీజెఐ పదవిలో ఆయన 17 నెలల పాటు కొనసాగుతారు. 2021 ఏప్రిల్ 23న పదవి విరమణ చేస్తారు. మాజీ సీజెఐ రంజన్ గొగోయ్ పదవి కాలం ఈ నెల17తో ముగిసిన విషయం తెలిసిందే. పదవి విరమణకు ముందు ఆయన పలు సంచలన కేసులకు సంబంధింది తుది తీర్పులు వెలువరించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయిన శరద్ అరవింద్ బాబ్డే ది మహారాష్ట్ర.
Next Story