Telugu Gateway
Latest News

జియో ‘ప్లాన్స్’ మార్చింది

జియో ‘ప్లాన్స్’ మార్చింది
X

రిలయన్స్ జియో దిగొచ్చింది. కొత్త ప్లాన్స్ తో వినియోగదారులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కన్పిస్తోంది. అందులో భాగంగా గతంలో ప్రకటించిన నిమిషానికి ఆరు పైసల ఛార్జీల విషయంలో మార్పులు చేసింది. అందులో భాగంగా కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఉచిత ఐయూసీ కాల్స్‌ ఆఫర్‌తో ‘జియో ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్స్‌ (మూడు రీచార్జ్‌ ప్లాన్ల)ను సోమవారం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీడేటాను అందిస్తోంది. ప్రధానంగా ఈ ప్లాన్లలో కీలక ఆఫర్ ఏమిటంటే జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌ టైమ్‌ను ప్రకటించింది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్‌ ఉచిత కాలింగ్‌ సదుపాయం కొనసాగుతుంది.

ఈ కొత్త ప్లాన్స్‌ ఒక నెలకు రూ. 222, 2 నెలలకు రూ. 333, 3 నెలలకు రూ. 444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. తమ కొత్త ప్లాన్స్‌ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ ను రూ. 111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 3 నెలల 2జీబీ ప్యాక్(రూ. 448) తో పోలిస్తే.. రూ. 444 మాత్రమే ఖర్చు అవుతుంది. రూ. 396 (198x2) ప్లాన్స్‌ లో గతంతో పోలిస్తే ఇపుడు రూ. 333 మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్‌ ఉచితమని జియో తెలిపింది.

Next Story
Share it