Telugu Gateway
Latest News

అమ్మాయికి 21..అబ్బాయికి15..రేప్ కేసు!

అమ్మాయికి 21..అబ్బాయికి15..రేప్ కేసు!
X

ఆ అమ్మాయి వయస్సు 21 సంవత్సరాలు. అబ్బాయి వయస్సు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల యువకుడు తనను రేప్ చేశాడని 21 సంవత్సరాల అమ్మాయి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసు ను విచారిస్తున్నారు. వీళ్లిద్దరూ కలసి కొన్ని రోజులు ముంబయ్ లో గడిపొచ్చారు. ఇద్దరిని వారి వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేసి వెనక్కి తీసుకొచ్చారు.ఆ తర్వాత ఈ కేసు నమోదు అయింది. దీంతో పోలీసులు వ్యవహారాన్ని మరింత పకడ్భందీగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. సెక్షన్‌ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. నిందితుడు తనను ముంబయ్ కి తీసుకెళ్లి ఒక హోటల్‌లో ఉంచి తనపై అత్యాచారం జరిపినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే నిందితుడి కుటుంబసభ్యులు మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. ఆ యువతి, బాలుడితో కలిసి ఇంటినుంచి పారిపోయి.. ముంబయ్ వెళ్లిపోయారని, ఇరు కుటుంబసభ్యులు వారిని ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారని చెబుతున్నారు. యువతి, బాలుడి ఒకరికొకరు తెలుసునని, నెలన్నర కింద వారు ఇంటినుంచి పారిపోయి ముంబయ్ లో గడిపారని, అక్కడి నుంచి తీసుకొచ్చాక, బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని మైనర్‌ బంధువులు అంటున్నారు. ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ.. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. కేసును విచారిస్తున్నామని తెలిపారు.

Next Story
Share it