Telugu Gateway
Latest News

‘గిటార్’ హోటల్ పైనే అందరి కళ్ళు

‘గిటార్’ హోటల్ పైనే అందరి కళ్ళు
X

అందరి కళ్ళు ఇఫ్పుడు ఆ హోటల్ వైపే. కొన్ని హోటల్స్ ఏకంగా ఆ దేశ పర్యాటక రంగానికి కొత్త జోష్ కూడా తెస్తాయనటంలో సందేహం లేదు. పలు హోటల్స్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు నిరూపించాయి. ఇప్పుడు అదే కోవలోకి మరో హోటల్ చేరబోతోంది. అమెరికాలోని దక్షిణ ప్లోరిడాకు ఇప్పుడు ఓ కొత్త పర్యాటక ఆకర్షణ వచ్చింది. అదే ‘గిటార్’ డిజైన్ హోటల్. తాజాగా ఈ హోటల్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులోని క్యాసినో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఈ తరహా హోటల్ లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం 1.5 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయంగా తమ బ్రాండ్ ను మార్కెట్ చేసేందుకు వీలుగా ఈ హోటల్ ను డిజైన్ చేసినట్లు హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ సీఈవో జిమ్ అలెన్ చెబుతున్నారు.

గిటార్‌ ఆకృతిలో నిర్మించిన ఈ హోటల్ లో ఏడు వేల సీట్లు కలిగిన కాసినో ఫ్లోర్, 1200 హోటల్‌ గదులు ఉన్నాయి. ఇక్కడ పలు సంగీత విభావరి వేదికలు ఉన్నాయి. ఈ హోటల్‌లో కాసినోనే ప్రధాన ఆకర్షణగా హోటల్‌ను నిర్మించినప్పటికీ పేరుకు తగ్గట్లుగా సంగీతానికి ప్రాధాన్యత ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అతి పెద్ద కృత్రిమ సరస్సు మధ్య 1200 గదులను విడి విడిగా నీటి మధ్యన నిర్మిచారు. సమీపంలోని ఆరోగ్యానిచ్చే స్పాల సేవలను అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ హోట్‌లో భూలోక స్వర్గం అవుతుందని యాజమాన్యం చెబుతోంది.

Next Story
Share it