Telugu Gateway
Latest News

ముంబయ్ లో కెనడా మోడల్ అరెస్ట్

ముంబయ్ లో కెనడా మోడల్ అరెస్ట్
X

కెనడా మోడల్ షీనా లకానీ ముంబయ్ లో అరెస్ట్ అయింది. ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఫ్లయింట్ స్వ్కాడ్ పై దాడి చేయటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ సిబ్బందితో కలసి పోలీసులు నిర్వహించే నాకా బందీ సమయంలో ఈ ఘర్షణ జరిగింది. ముంబయ్ లోని వీరా దేశాయ్ రోడ్డు మార్గంలో పయనిస్తున్న ఆమె వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీలో భాగంగా నిలిపారు. అయితే ఆమె పోలీసులతో మాట్లాడుతూ తాను ఎన్ఆర్ఐని అని..తనకు ఎన్నికలతో సంబంధం లేదని తెలిపారు.

తనిఖీల తర్వాత ఆ మోడల్ వాహనం ముందుకు వెళ్ళేందుకు అనుమతించారు. అయితే ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ఆమె తన స్నేహితులతో కలసి బైక్ పై వచ్చి తనిఖీలు జరిగిన ప్రాంతంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా పోలీసులు తనిఖీ సమయంలో షూట్ చేసిన వీడియో గ్రాఫర్ నుంచి కెమెరా లాక్కోవటంతో పాటు..తాము ఉన్న ఫుటేజీ డిలీట్ చేయాలని వాదించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రోటోకాల్ గురించి వివరించే ప్రయత్నం చేసినా ఆమె వినకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story
Share it