Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘టార్గెట్ టీడీపీ’..గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో ‘టార్గెట్ టీడీపీ’..గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు
X

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి జగన్ సర్కారుపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వం టీడీపీ నాయకులు..కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వేదిస్తోందని అన్నారు. ఈ మేరకు 13 పేజీల వినతిపత్రాన్ని టీడీపీ నేతల బృందం గవర్నర్ కు అందజేసింది. పోలీసు శాఖలో డీజీపీ నుంచి కింది స్థాయిలోనూ చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు ఇలాంటి పరిణామాలే కారణమన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క కోడెల మీదే 18 కేసులు అక్రమంగా పెట్టారని ఆరోపించారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, నన్నపనేని రాజకుమారితో సహా పలువురు నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ అక్రమాలు..అరాచకాలపై డీజీపికి రెండు పుస్తకాలు అందజేసినా ఫలితం ఉండదన్నారు. గవర్నర్ అయినా చొరవ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. చంద్రబాబు విజయవాడలో మీడియాతో కూడా మాట్లాడారు. కోడెలపై భయంకరమైన కేసులు పెట్టి వేధించారన్నారు. మూడు నెలలుగా కోడెలను వేధించారని ఆరోపించారు. వైసీపీ నేతలు చెపుతున్నట్లే పోలీసులు నడుచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

Next Story
Share it