గోవా విమానం ఇంజన్ లో మంటలు
BY Telugu Gateway30 Sept 2019 1:29 PM IST
X
Telugu Gateway30 Sept 2019 1:29 PM IST
అది ఇండిగో విమానం. ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవా నుంచి ఢిల్లీ బయలుదేరింది. ఆదివారం రాత్రి డంబోలిమ్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్ లో మంటలు వచ్చాయి. పైలట్లు దీన్ని గుర్తించి అత్యవసరంగా విమానాన్ని కిందకు దించారు. ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
పైలట్లు అప్రమత్తతో వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పినట్లు అయిందని అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే విమానం ఇంజన్ లో పొగలు వచ్చాయి. ఈ విమానంలో గోవా మంత్రితో పలువురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
Next Story