Telugu Gateway
Latest News

పర్యాటకులకు గేట్లు తెరిచిన సౌదీ అరేబియా

పర్యాటకులకు గేట్లు తెరిచిన సౌదీ అరేబియా
X

సౌదీ అరేబియా తొలిసారి పర్యాటక రంగానికి గేట్లు ఎత్తనుంది. ఇప్పటివరకూ ఆ దేశంలో చాలా ఆంక్షలు ఉండేవి. ఇక నుంచి ఆయిల్ పైనే పూర్తిగా ఆధారపడితే దెబ్బతింటామనే విషయం గ్రహించిన సౌదీ అరేబియా పర్యాటక రంగం ద్వారా కూడా ఆదాయాన్ని టార్గెట్ గా చేసుకుంది. విదేశీ పర్యాటకులకు సంబంధించి డ్రెస్ కోడ్ పై కూడా ఆంక్షలు సడలించనుంది. ప్రస్తుతం అక్కడ డ్రెస్ కోడ్ కు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. పర్యాటకులకు ద్వారం తెరవటంతో ఈ నిబంధనల్లో కూడా సడలింపు రానుంది. సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030లో భాగంగా పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

అతి పెద్ద ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాకు అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించటం చారిత్రక సంఘటనగా ఆ దేశ పర్యాటక చీఫ్ అహ్మద్ అల్ ఖతీఫ్ పేర్కొన్నారు. తమ దేశాన్ని సందర్శించటం ద్వారా పర్యాటకులు ఆశ్చర్యచకితులు అవుతారని తెలిపారు. యునెస్కో గుర్తించిన ఐదు ప్రపంచ వారసత్వ కట్టడాలతోపాటు స్థానిక సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతి అందాలను వీక్షించవచ్చని తెలిపారు. 49 దేశాలకు చెందిన పర్యాటకుల నుంచి ఆన్ లైన్ టూరిస్ట్ వీసాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ శనివారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Next Story
Share it