పెరిగిన పెట్రో ధరలు
BY Telugu Gateway18 Sept 2019 2:17 PM IST

X
Telugu Gateway18 Sept 2019 2:17 PM IST
సౌదీలో నెలకొన్న చమురు సంక్షోభం ప్రభావం భారత్ పై అప్పుడే ప్రారంభం అయింది. అప్పుడే పెట్రోల్ ధరల పెంపు ప్రారంభం అయింది. అయితే ఇది ప్రారంభం మాత్రమే అని..రాబోయే రోజుల్లో ఈ పెంపు మరింత ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ తర్వాత ఒకేరోజు ఈస్ధాయిలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడంతో పాటు సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో పెట్రో ధరలు పేట్రేగిపోతున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ 25 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్కు 24 పైసల మేర పెరిగింది. పెట్రో ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ 72.42 కాగా, హైదరాబాద్లో రూ 76.99 ముంబైలో రూ 75.26, చెన్నైలో రూ 69.57, కోల్కతాలో రూ 68.23 పలికింది.
Next Story