Telugu Gateway
Latest News

గోవాలో ‘న్యూడ్ పార్టీ కలకలం!

గోవాలో ‘న్యూడ్ పార్టీ కలకలం!
X

గోవా. దేశంలో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకునే ప్రాంతం. పర్యాటకంగా ఎంతో పేరున్న గోవాలో ఆకస్మాత్తుగా ‘న్యూడ్ పార్టీ’ వ్యవహారం పెద్ద కలకలం రేపింది. ఈ న్యూడ్ పార్టీకి సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. ఉత్తర గోవాలో ఈ న్యూడ్ పార్టీ జరగనున్నట్లు పోస్టర్ ప్రత్యక్షం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ న్యూడ్ పార్టీలో 15 మంది విదేశీయులు, పది మంది భారతీయ యువతులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అలాంటి పార్టీలకు అనుమతి ఇచ్చే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు.

అయితే న్యూడ్ పార్టీ వార్తలు మాత్రం గోవాలో రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే అత్యంత రహస్యంగా ఈ పార్టీ నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని..పోస్టర్ లో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం విషయం మాత్రమే ప్రస్తావించారని పోలీసులు వెల్లడించారు. దేశంలోనే క్యాసినోలు ఉన్న ఏకైక ప్రాంతం కూడా గోవా అన్న సంగతి తెలిసిందే. గోవాకు నిత్యం భారీ ఎత్తున విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు.

Next Story
Share it