తగ్గిన మారుతి కార్ల ధరలు
BY Telugu Gateway25 Sept 2019 2:20 PM IST

X
Telugu Gateway25 Sept 2019 2:20 PM IST
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి ధరలు తగ్గాయి. ఈ మేరకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. పలు మోడళ్ళపై ఈ ధరల తగ్గుదల సత్వరమే అమల్లోకి రానుంది. సెప్టెంబర్ 25 నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ధరలు తగ్గిన మోడళ్ళలో ఆల్టో 800, ఆల్టో కే10,, స్విఫ్ట్, బాలెనో, సెలెరియో, విటారా బ్రెజా, ఎస్ క్రాస్ వాహనాలు ఉన్నాయి.
ఒక్కో మోడల్ పై ఐదు వేల రూపాయల లెక్కన ధర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రమోషన్ ఆఫర్లకు ఇది అదనం. ధరల తగ్గింపుతో పండగ సీజన్ లో అమ్మకాలు కొంత అయినా పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Next Story



