బ్రాండ్ బాబుల క్రేజీ ఐ ఫోన్లు వచ్చేశాయ్

ఐఫోన్ అంటే యూత్ కు క్రేజ్. ఒక్క యూత్ కే కాదు.. బ్రాండ్ బాబులు ఐఫోన్లు తప్ప మరేమీ వాడరు. ఎందుకంటే ఆ ఫోన్ క్వాలిటీ ఒకెత్తు అయితే...ఆ బ్రాండ్ వ్యాల్యూ మరో ఎత్తు. అందుకే మార్కెట్లో కొత్త ఐఫోన్ వచ్చింది అంటే చాలు..వాటికి ఉండే డిమాండే వేరు. యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ 11 వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎన్నో ప్రత్యేక ఫీచర్లలో ఈ ఫోన్లను విడుదల అయ్యాయి. మార్కెట్లో ఇవి సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటి బుకింగ్స్ మాత్రం 13వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ అధునాతన స్మార్ట్ ఫోన్‌లను యాపిల్ హెడ్‌క్వార్టర్స్ క్యుపర్టినోలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియమ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఐ ఫోన్ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్, పర్పుల్ రెడ్, పసుపు రంగుల్లో లభించనున్నది. స్పెషల్ ఆడియో, డాల్బీ అట్మోస్ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6.1 లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్ సెల్ఫీలు, ఏ13 బయోనిక్ చిప్ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఐఫోన్ 11 ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది.ఇప్పటివరకూ ఏ ఐఫోన్ లో లేని విధంగా 4కె స్పష్టతతో సినిమాటిక్ వీడియాలు తీసుకునే వెసులుబాటు లభించనుంది. ఇఫ్పటివరకూ ఇతర ఐఫోన్లలో రానంత స్పష్టంగా ఇందులో వీడియోలు వస్తాయి. ఒక్కో ఫోన్ లో ఒక్కో ప్రత్యేకతతో మార్కెట్లోకి వీటిని విడుదల చేయనున్నారు. అదే సమయంలో యాపిల్ సంస్థ ఏడవ తరం ఐప్యాడ్ తో పాటు కొత్త వాచీలను విడుదల చేసింది. ఐవాచ్ సిరీస్ 5ను తీసుకొచ్చింది సంస్థ. ఈ వాచ్‌ల్లో కంపాస్‌ను కూడా అమర్చింది. ధర 399 నుంచి 499 డాలర్లు. ఐప్యాడ్ ధరలు 329 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. కొత్తగా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్–యాపిల్ టీవీ, వీడియో గేమింగ్ సర్వీస్ ఆర్కేడ్‌లను అందుబాటులోకి తెచ్చింది.