Telugu Gateway
Latest News

వాళ్ళు కండోమ్స్ కూడా కొనలేకపోతున్నారట!

వాళ్ళు కండోమ్స్ కూడా కొనలేకపోతున్నారట!
X

ఆర్ధిక మాంద్యం. ఇటీవల బాగా చర్చనీయాంశం అవుతున్న అంశం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతోంది. భారత్ లోనూ ఇప్పుడు అవే భయాలు వెంటాడుతున్నాయి. కేంద్రం అందుకే పలు ఉపశమన చర్యలు చేపడుతోంది. ఇదంతా ఒకెత్తు అయితే అక్కడ మాత్రం ప్రజలు ‘కండోమ్స్’ కూడా కొనలేకపోతున్నారట.ఈ విషయం ఇఫ్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దక్షిణ అమెరికాలో కీలక ఆర్ధిక వ్యవస్థ అయిన అర్జెంటీనా ఇఫ్పుడు ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. డాలర్ తో పోలిస్తే అర్జెంటీనా కరెన్సీ అయిన పెసో విలువ దారుణంగా పడిపోయింది. అదే ఇప్పుడు అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. పరిస్థితి ఎంత దారుణగా ఉంది అంటే కండోమ్ కూడా కొనలేకపోతున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు.

ప్రజలు కండోమ్ లు కొనేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదని..మెడికల్ షాప్ యాజమానులు చెబుతున్నారు. ఆర్ధిక మాంద్యం కారణంగా కండోమ్ ల అమ్మకాలు ఎనిమిది శాతం, గర్బ నిరోధక మాత్రల అమ్మకాలు ఆరు శాతం మేర పడిపోవటం పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అర్జెంటీనా కు చెందిన పాపులర్ నటుడు అయిన గిల్లెర్మో ఓ వీడియోలో మాట్లాడుతూ పెసో విలువ పడిపోవటం తనను బాధిస్తోందని పేర్కొన్నారు. కనీసం నా భాగస్వామిని సుఖపెట్టలేకపోతున్నాను. నా దగ్గర ఒక కండోమ్ మాత్రమే మిగిలింది అని ఆయన చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిరోధ్ లు తయారు చేసేందుకు అవసరమైన సరుకును ఆ దేశం పూర్తిగా దిగుమతి చేసుకుంటోంది. కరెన్సీ విలువ క్షీణించటంతో కండోమ్ ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాదిలోనే కండోమ్ ల ధర 36 శాతం పెరిగిందని చెబుతున్నారు.

Next Story
Share it