Telugu Gateway
Latest News

విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు తప్పనిసరి

విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు తప్పనిసరి
X

దేశంలోని అన్ని ప్రముఖ విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు తప్పనిసరి చేస్తున్నారు. అయితే దీనికి రెండేళ్ల సమయం ఇచ్చారు. రెండేళ్ళలో భారత్ లోని ప్రధాన విమానాశ్రయాలు అన్నీ బాడీ స్కానర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఏఎస్) స్పష్టం చేసింది. ప్రయాణికులకు మరింత మెరుగైన భద్రత కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బాడీ స్కానర్ల ఏర్పాటుతో ప్రయాణికులు ఎలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం లేకుండా పోతుందని..దేహంలో ఎలాంటి వస్తువును అమర్చినా ఇవి అట్టే కనిపెట్టేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పౌరవిమానయాన శాఖ పరిధిలో ఉండే బిసిఏఎస్ పౌరవిమానయాన రంగంలోని భద్రతా అంశాలపై దృష్టి సారిస్తుందనే విషయం తెలిసిందే. ఇఫ్పటికే పలు దేశాల్లోని విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అక్రమంగా బంగారం దిగుమతితోపాటు పలు అక్రమాలకు పాల్పడేందుకు ప్రయాణికులు ఎప్పటికప్పుడు వినూత్న మార్గాలు అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి బాడీ స్కానర్లతో మరింత చెక్ పెట్టొచ్చని అంచనా.

Next Story
Share it