Telugu Gateway
Latest News

ప్రత్యేక ఆకర్షణగా బీజింగ్ ‘స్టార్ ఫిష్’ విమానాశ్రయం

ప్రత్యేక ఆకర్షణగా బీజింగ్ ‘స్టార్ ఫిష్’ విమానాశ్రయం
X

ఏడు లక్షల చదరపు మీటర్లు. 173 ఎకరాలు. వంద ఫుట్ బాల్ పిచ్ ల పరిమాణంతో కూడిన ప్రపంచంలోని అతి పెద్ద విమానాశ్రయ టెర్మినల్ చైనాలోని బీజింగ్ లో ప్రారంభం అయింది. ఈ విమానాశ్రయాన్ని బుధవారం నాడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రారంభించారు. ‘స్టార్ ఫిష్’ ఆకారంలో ఉండే ఈ విమానాశ్రయం చైనా ఫ్యూచరిస్టిక్ ఎయిర్ పోర్ట్ గా చెబుతున్నారు. త్వరలోనే ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా ఎదుగుతుందని అంచనా. చైనాలో కమ్యూనిస్టు పాలన ముగిసి 70 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా అత్యాధునిక హంగులతో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ పోర్టుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాచారు. ఈ విమానాశ్రయం తన పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని 2040కి అందుకుంటుందని అంచనా. ఎనిమిది రన్ వేలతో ఇది ఏటా 100 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుందని చెబుతున్నారు.

బీజింగ్ లో ఈ నూతన డాక్సింగ్ ఎయిర్ పోర్టు నుంచి తమ సర్వీసులు ప్రారంభించేందుకు బ్రిటీష్ ఎయిర్ వేస్, క్యాథే ఫసిఫిక్, ఫిన్ ఎయిర్ లు తమ సంసిద్ధం వ్యక్తం చేశాయి. ఈ విమానాశ్రయం డిజైన్ ను ఇరాకి-బ్రిటీష్ ఆర్కిటెక్ట్ జహ హడిడ్ అందించారు. ఈ విమానాశ్రయం ప్రాజెక్టు అంచనా వ్యయం 17.5 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయం అత్యంత రద్దీ విమానాశ్రయంగా ఉంది. వచ్చే ఏడాది నాటికే చైనా అమెరికా ఏవియేషన్ మార్కె ట్ ను అధిగమించే అవకాశం ఉందని అంచనా వెలువడుతున్నాయి. ఐదేళ్ళలో చైనా బీజింగ్ లోని ఈ డాక్సింగ్ విమానాశ్రయం పనులను పూర్తి చేసింది.

https://www.youtube.com/watch?v=7MmJF_KebMA

Next Story
Share it