Telugu Gateway

‘ఆమెజాన్’ ఆఫర్ల పండగ వస్తోంది

‘ఆమెజాన్’ ఆఫర్ల పండగ వస్తోంది
X

పండుగలు..ఆఫర్ల పండుగలు. రెండూ కలసి వస్తాయి. ఆఫర్లు పండుగను ఎంజాయ్ చేసేలా వస్తాయి. వ్యాపారానికి అది ఓ సెంటిమెంట్ కూడా. ప్రతి ఏటా వచ్చినట్లే ఈ సారి కూడా ఆమెజాన్ ఆఫర్ల పండుగతో ముందుకొస్తోంది. ఈ సారి అందులో ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఆన్ లైన్ లో అమ్మకాలు జరపటమే కాకుండా ‘ఆఫర్స్ ఆన్ వీల్స్’ అన్న చందంగా దేశంలోని 13 నగరాల్లో ‘హౌస్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట 600 ఉత్పత్తులను వినియోగదారుల ముంగిటకు తీసుకురానుంది. మూడు హెవీ కంటైనర్లను కలిపి రూపొందించిన ఈ ప్రత్యేక వాహనం ఢిల్లీ, విశాఖపట్నం, చెన్నై, మధుర, ఆగ్రా, లక్నో, ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కొచ్చిల్లో మొత్తం 6,000 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కింద ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు పలు విభాగాల్లో భారీ ఆఫర్లు ఇవ్వనున్నారు వినియోగదారులకు. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం కలిగినవారు సెప్టెంబర్‌ 28 మధ్యాహ్నం 12 గంటలకే ఆఫర్లను అందుకోవచ్చు. భారత్‌లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఈసారి ఆఫర్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు పూర్తిచేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వివరించింది. యూత్ ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే ఈ ఆఫర్లలో

పలు అధునాతన స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్, అదనపు క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్, నో కాస్ట్‌ ఈఎంఐ, ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ వంటి ప్రత్యేక ఆఫర్లను గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌లో అందించనుంది. శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ, ఓపో, వివో వంటి ప్రఖ్యాత బ్రాండ్లు అందుబాటులో ఉండగా.. ఎక్సే్ఛంజ్‌ ఆఫర్‌ కింద రూ. 6,000 వరకు ఇవ్వనుంది. మొబైల్‌ కేసులు, కవర్ల ప్రారంభ ధర రూ. 69గా ప్రకటించింది. బ్లూ టూత్‌లపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ ఉంది. ఇతర గృహోపకరణాలపై కూడా భారీ ఆపర్లు ప్రకటించనున్నారు.

Next Story
Share it