Telugu Gateway
Latest News

‘టైమ్’ మ్యాగజైన్ జాబితాలో స్టాట్యూ ఆప్ యూనిటీ

‘టైమ్’ మ్యాగజైన్ జాబితాలో స్టాట్యూ ఆప్ యూనిటీ
X

ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాల జాబితాలో 182 మీటర్ల ఎత్తైన భారత్ కు చెందిన ‘స్టాట్యూ ఆప్ యూనిటీ’ చోటు దక్కింది. 2019 సంవత్సరానికి సంబంధించి టైమ్ మ్యాగజైన్ ఏకంగా వంద ప్రాంతాలను ఎంపిక చేసింది. వీటిని ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాంతాలుగా పేర్కొన్నారు. ఎన్నో ప్రత్యేకతలు..చూడదగ్గ ప్రాంతాలు అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా సిద్ధం చేశారు.

టైమ్ జాబితాలో స్టాట్యూ ఆఫ్ యూనిటీకి చోటు దక్కటంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఇది చాలా మంచి వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం ఒక్క రోజులోనే ఈ స్టాట్యూను ఏకంగా 34 వేల మంది పర్యాటకులు సందర్శించారు. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద ఈ విగ్రహం ఉంది. 2989 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ విగ్రహ ప్రాజెక్టు చేపట్టారు. 2018 అక్టోబర్ 31న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది.

Next Story
Share it