Telugu Gateway
Latest News

ఆర్ బిఐ కీలక నిర్ణయం..వడ్డీ రేట్లు తగ్గాయ్

ఆర్ బిఐ కీలక నిర్ణయం..వడ్డీ రేట్లు తగ్గాయ్
X

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు ఆర్ధిక మాంద్యం ఛాయలు కమ్ముకుంటున్నాయని..ప్రగతికి బ్రేకులు పడుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న వేళ వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్ బిఐ కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లు దిగివచ్చేలా అత్యంత కీలకమైన రెపోరేటును 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ బుధవారం తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 5.40 శాతానికి దిగివచ్చింది. ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంక్‌ అంచనా 4 శాతం కంటే దిగువనే ఉండటంతో వడ్డీరేట్లలో కోత విధించవచ్చని పరిశ్రమ,మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ రెపోరేటును తగ్గుముఖం పట్టింది.

ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌ మాసాల్లో రెపో రేటును సవరించడం ద్వారా 75 పాయింట్ల మేర కీలక రేట్లలో కోత విధించింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే పండుగ సీజన్‌కు ముందే రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాలని ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో సంకేతాలు పంపింది. మరోవైపు ఆర్‌బీఐ అందించిన వెసులుబాటును బ్యాంకులు ఎంత మేర తమ ఖాతాదారులకు వర్తింపచేస్తాయో వేచిచూడాల్సిందే. మరి ఈ వడ్డీ రేట్ల తగ్గింపు చేరాల్సిన వారికి చేరి ఫలితాలు ఏ మేరకు వస్తాయో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Next Story
Share it