Telugu Gateway

అమెరికాలో మళ్ళీ కాల్పులు

అమెరికాలో మళ్ళీ కాల్పులు
X

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత మోగుతూనే ఉంది. తాజాగా కాల్పుల్లో 20 మంది చ నిపోగా...మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ సారి కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. అమెరికాలోని ఓహియో, డేటాస్‌లోని ఓ బార్‌ వెలుపల దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, 16 మంది గాయపడ్డారు. తాము కొద్దిసేపటికే ఘటన స్థలానికి చేరుకుని.. దుండగుడిని మట్టుబెట్టినట్టు పోలీసలు వెల్లడించారు.

గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తలించారు. ఈ ఘటనకు కొన్ని గంటల ముందే టెక్సాస్‌లోని వాల్‌మార్ట్‌ లో జరిగిన కాల్పుల్లో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక రోజు వ్యవధిలోనే అగ్రరాజ్యంలో రెండు చోట్ల కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. అమెరికాలో ఎలాంటి కారణాలు లేకుండా ఇలా విచక్షణారహిత కాల్పులు జరగటం.అందులో పెద్ద ఎత్తున పౌరులు ప్రాణాలు వదలాల్సి రావటం ప్రజలను ద్రిగ్భాంతికి గురిచేస్తోంది.

Next Story
Share it