Telugu Gateway
Latest News

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
X

ఓ వైపు మాంద్యం ముంచుకొస్తోంది. మరో వైపు వృద్ధి రేటు మందగిస్తోంది. తాజాగా వెలువడిన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లెక్కలు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లు తేల్చాయి. ఏకంగా జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ళ కనిష్టానికి పడిపోయింది. గత కొంత కాలంగా దేశంలోని పలు కీలక రంగాల్లో తిరోగమనంలో సాగుతున్నాయి. కేంద్రం తాజాగా ప్రకటించిన ఉద్దీపనలు రాబోయే రోజుల్లో ఏమైనా ఫలితాలు ఇస్తాయా? లేదా అన్న టెన్షన్ ప్రస్తుతం అందరిలో నెలకొంది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతానికి పడిపోయింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 5.8 శాతంగా ఉంది. దీంతో జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరినట్లు అయింది.

అటు జీవీఏ 4.9 శాతానికి క్షీణించింది. జీడీపీ తక్కువగా ఉంటుందని ఊహించినప్పటికీ, ఇంత దారుణ అంచనా వేయలేక పోయామనీ, దీంతో దేశంలో మరోసారి మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధనలో భాగంగా పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ శుక్రవారంనిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రధానంగా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణను ప్రకటించారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద సంస్థలుగా రూపొందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it