మరదలిపై బావ అత్యాచారం
BY Telugu Gateway14 Jun 2019 4:24 AM GMT

X
Telugu Gateway14 Jun 2019 4:24 AM GMT
మరదలిపై బావ అత్యాచారం. ఒక్క రోజు కాదు..రెండు రోజులు కాదు. ఏకంగా ఆరేళ్ళ నుంచి ఈ దారుణం కొనసాగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చెల్లెలిపైనే దారుణానికి ఒడిగట్టాడు ఆ వ్యక్తి. 30 వయస్సు ఉన్న అయ్యప్పన్ పై ఇప్పుడు కేసు నమోదు అయింది. అసలు విషయం వెలుగులోకి రావటం ఈ దారుణానికి పాల్పడిన అయ్యప్పన్ పరారీలో ఉన్నాడు.
లవర్ వెంట తిరిగి గర్భం దాల్చిందని చెబుతూ అయ్యప్పన్ తన మరదలి గర్భం తీయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్ళగా..ఆస్పత్రి వైద్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బెదిరించి మరీ మరదలిని లొంగదీసుకున్నట్లు పోలీసుల విచారణంలో తేలింది. ఈ ఘటన తమిళనాడుకు చెందిన కన్యాకుమారి జిల్లాలోని కరుత్తన్ గోడులో జరిగింది.
Next Story