Telugu Gateway
Latest News

కొత్తగా 4791 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై

కొత్తగా 4791 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై
X

భారతీయ రైల్వే దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఒక్క మే నెలలోనే 2.35 కోట్ల మంది ఈ సేవలను ఉపయోగించుకున్నారు. దేశంలోని మొత్తం 1600 స్టేషన్లలో ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు.రైల్వేలకు చెందిన డిజిటల్ సంస్థ ‘రైల్ టెల్’ ఈ విషయాన్ని వెల్లడింది. ఈ ఏడాది దేశంలోని మరో 4791 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. మే నెలలో ఒక్క హౌరా స్టేషన్ లోనే 4.9 లక్షల మంది యూజర్లు ఉచిత వైఫై సేవల కోసం లాగిన్ అయ్యారు. ప్రస్తుతం దేశంలోని యూత్ అంతా నిత్యం ఇంటర్నెట్ సర్ఫింగ్ లోనే మునిగితేలుతోంది.

అది విమానాశ్రయం అయినా..రైల్వే స్టేషన్ అయినా అదే వరస. అందునా ఉచిత వైఫై అంటే ఇక చెప్పేదేముంది. రైల్వే స్టేషన్ లోకి ఎంటరైన వెంటనే అసలు పక్కన ఏమి జరుగుతుందో పట్టించుకోకుండా అందరూ ఫోన్ లో తలదూర్చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అయినా సరే ఫోన్ లో నెట్ వాడకాన్ని ఎవరూ తగ్గించేందుకు ఆసక్తిచూపటం లేదు.

Next Story
Share it