Telugu Gateway
Latest News

వీడియో చూడలేదని విమానం దింపేశారు

వీడియో చూడలేదని విమానం దింపేశారు
X

ఓ విమానం నుంచి మహిళను బలవంతంగా కిందకు దించేశారు. దీనికి కారణం ఏంటో తెలుసా?. వీడియో చూడలేదని. ఏ విమాన ప్రయాణికుడు అయినా..ఎన్నిసార్లు విమానయానం చేసినా విమాన సిబ్బంది చెప్పే భద్రతా సూచనలు వినాల్సిందే. వినకపోతే కనీసం ఆ రకంగా నటించాల్సిందే. ఇఫ్పుడు చాలా విమానాల్లో అవి వీడియో రూపంలోనే ప్రదర్శిస్తున్నారు. దీని ద్వారా విమాన సిబ్బందికి పలు ఎయిర్ లైన్స్ ఆ పని తప్పించాయి.

విమానం టేకాఫ్ కు ముందు ఓ మహిళ భద్రతా చర్యలకు సంబంధించిన వీడియో వీక్షించటానికి నిరాకరించారు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి..వారి సాయంతో ఆమెను కిందకు దింపేశారు. ఈ ఘటన ఎయిర్ న్యూజిలాండ్ విమానంలో జరిగింది. సివిల్ ఏవియేషన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెకు నోటీసులు అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story
Share it