Telugu Gateway
Latest News

రన్ వే నుంచి...నదిలోకి విమానం

రన్ వే నుంచి...నదిలోకి విమానం
X

ల్యాండ్ అయి రన్ వేపై ఆగాల్సిన విమానం నదిలోకి వెళ్ళింది. అంతే ఒక్కసారిగా కలకలం. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే అగ్నిమాపక, రక్షణ దళాలు రంగ ప్రవేశం చేసి ప్రయాణికులను అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

క్యూబా నుంచి వచ్చిన బోయింగ్ 737 విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్ వే మీద నుంచి జారుకుంటూ నదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 143 మంది ఉన్నారు. ఈ ఘటనతో విమానంలోని కొంత మందికి గాయాలు అయ్యాయని జాక్సన్ విల్లే మేయర్ తెలిపారు. విమాన ఇంథనం ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) నదిలోని నీటితో కలవకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఫ్యూయల్ కు మండే స్వభాగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Next Story
Share it