టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేత

దేశంలో ఓ వైపు సంచలనం. మరో వైపు కలకలం. టిక్ టాక్ యాప్ ఈ రెండూ సృష్టించింది. అందులో కొంత సృజనాత్మకత ఉంటే..ఎక్కువ అశ్లీలత. అంతే ఒక్కసారిగా గగ్గోలు. ఈ యాప్ ను నిషేధించాలని పలు డిమాండ్లు. కొద్ది రోజుల క్రితం బ్యాన్ కు గురైన యాప్ ను మధురై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది.అయితే కొన్ని పరిమితులతో మాత్రమే ఇది అనుమతిస్తారు. ఏమైనా తేడా వస్తే కంపెనీ కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువత, చిన్నారుల్లో ఎంతో ఆదరణ పొందిన టిక్‌టాక్ మొబైల్ యాప్‌తో అశ్లీల కంటెంట్ వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 3వ తేదీన కోర్టు యాప్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్‌పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎన్ కురుబకరన్, జస్టిస్ ఎస్ ఎస్ సుందర్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. టిక్‌టాక్ అశ్లీలతను పెంపొందించడమే కాకుండా.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందంటూ మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తుకుమార్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది.
ఏకపక్షంగా వ్యవహరిస్తూ మద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ టిక్‌టాక్ సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు టిక్‌టాక్ యాప్‌పై మాద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. చైనాలో ఈ యాప్ 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వినియోగదారులతో 75 భాషల్లో ఈ అప్లికేషన్ టాప్ సోషల్ యాప్‌లలో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. ఎలాంటి ప్రత్యేకమైన సెటప్ లేకుండా ఫోన్‌ని చేతిలో పట్టుకొని 15 సెకండ్ల వ్యవధితో రెడీమేడ్‌గా ఉండే డైలాగ్స్, పాటలకు తగ్గట్లు పెదాలను సింక్ చేస్తూ చాలా వేగంగా షార్ట్ వీడియోలు తీయగలగడం దీని ప్రత్యేకత. టిక్‌టాక్‌ని ఎంతమంది వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నారో, అంతకుమించి దుర్వినియోగం కూడా చేస్తున్నారు.