ప్రయాణికులకు ‘ఎయిర్ ఇండియా షాక్’
BY Telugu Gateway27 April 2019 6:39 AM GMT

X
Telugu Gateway27 April 2019 6:39 AM GMT
అసలే జెట్ ఎయిర్ వేస్ మూతతో ఇబ్బంది పడుతున్న విమాన ప్రయాణికులకు మరో షాక్. శనివారం తెల్లవారు జాము నుంచి ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయ. సర్వర్ లో తలెత్తిన సమస్య వల్ల దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ రూట్లలోనూ పలు సర్వీసుల్లో అసాధారణ జాప్యం చోటుచేసుకుంది. దీని వల్ల ప్రయాణికులు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది.
దీంతో పలు ప్రాంతాల్లో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే కాలం వెళ్ళదీస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు కొంత మంది ప్రయానికులు. ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. సాధ్యమైనంత వేగంగా సర్వర్ సమస్యను పరిష్కరించే పనిలో తమ టెక్నికల్ టీమ్ ఉందని వెల్లడించింది.
Next Story