కుప్పకూలిన విమానం..157 మంది మృతి
అంతా ఆకాశయానానికి రెడీ అయిపోయారు. ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. ఆ విమానం కూలిపోతుంది అని. అందరూ మృత్యువాత పడతారని. విమానం టేకాఫ్ అయిన ఆరు నిమిషాల్లోనే అంతా జరిగింది. సిబ్బందితో సహా మొత్తం 157 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిణామంతో అంతా నివ్వెరపోయారు. ఇథియోఫియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశానికికి చెందిన ఇథియోపియా రాజధాని ఆడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి బయలుదేరిన విమానం ఈ ప్రమాదం బారిన పడింది.
బోయింగ్ 737 విమానం మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలిందని ఇథియోపియా ప్రధాని కార్యాలయం వెల్లడించింది. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణీకులకు ఇథియోపియా ప్రధాని కార్యాలయం ప్రభుత్వం, ప్రజల తరపున తీవ్ర సంతాపం తెలుపుతోందని ప్రధాని అబివ్ అహ్మద్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా విమానం ఎక్కడ కుప్పకూలింది. అయితే బోయింగ్ 737 విమానం ప్రమాదానికి గురైన సమయంలో విమానంలో 149 మంది ప్రయాణీకులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. 33 దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నారు.