Telugu Gateway
Latest News

దేవుడే మిమ్మల్ని కాపాడాలి

దేవుడే మిమ్మల్ని కాపాడాలి
X

సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు ఝలక్ ఇఛ్చింది. తమ ఆదేశాలు అమలు చేయటంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినందున ఏకంగా సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఈనెల 12న న్యాయస్ధానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలి చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది. తన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సీబీఐ ప్రాసిక్యూషన్‌ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ ఎస్‌ వాసూరాంను కూడా కోర్టు ఎదుట హాజరు కావాలని సుప్రీం బెంచ్‌ తేల్చిచెప్పింది. ఏకే శర్మ బదిలీ ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల పేర్లను ఇవ్వాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ రంజన్‌ గొగొయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఆడుకున్నారు. దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎప్పుడూ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆడుకోకండి.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఇవాళ ఢిల్లీసాకేత్‌ పోక్సో కోర్టుకు బదిలీ చేయడమే కాకుండా, విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ముజఫర్‌పూర్‌లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న షెల్టర్‌ హోంలో పలువురు బాలికలపై హోం నిర్వాహకులు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Next Story
Share it