భారత ‘గగనతలం’లోకి కొత్తగా వెయ్యి విమానాలు

దేశీయ గగనతలం కొత్త రూపు సంతరించుకోనుంది. ఎందుకంటే కొత్తగా వెయ్యి విమానాలు ఆకాశయానికి రెడీ కాబోతున్నాయి. ఎందుకంటే దేశీయ విమానయాన రంగం ఏటా ఇరవై శాతం వృద్ధితో దూసుకెళుతోంది. దేశంలో కొత్తగా విమానయాన రంగానికి సంబంధించి మౌలికసదుపాయాలు మెరుగవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ సౌకర్యాలు దేశంలో తక్కువే ఉన్నా..ఇప్పుడిప్పుడే విమానయాన రంగంలో భారత్ దూసుకెళుతోంది. వచ్చే ఏడెనిమిదేళ్లలో వేయి విమానాలు ప్రయాణీకులకు అందుబాటులోకి రాబోతున్నాయి.
వచ్చే పదిహేను సంవత్సరాల్లో దేశంలో అదనంగా మరో 100 విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయని , ఏడెనిమిదేళ్లలో వేయికి పైగా విమానాలు తోడవనున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యర్శి ఆర్ఎన్ చూబే వెల్లడించారు. భారత్ ఏవియేషన్ లోకోమోటివ్ హబ్‌గా మారనుందని ఆర్ఎన్ చూబే తెలిపారు. భారత్‌లో విమానయాన వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికమని, ఇది నిలకడగా కొనసాగుతున్నదని ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో తెలిపారు. ఏవియేషన్ ఇంధన ధరలు భారం కాకుండా ఉంటే మరో ఇరవయ్యేళ్లు ఈ వృద్ధి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.