Telugu Gateway
Latest News

మార్చి నుంచి విమానాల్లో మొబైల్ సేవలు!

మార్చి నుంచి విమానాల్లో మొబైల్ సేవలు!
X

భారత్ లో విమానాల్లో ఫోన్ల వాడకానికి త్వరలోనే మార్గం సుగమం కానుంది. ఇఫ్పటికే ఈ సౌకర్యం విదేశాల్లోని పలు ఎయిర్ లైన్స్ అందిస్తున్నాయి. విమానం నుంచి ఫోన్ వాడకంతో పాటు నెట్ సౌకర్యం కూడా ఉపయోగించుకోవచ్చు. దీని కోసం కొద్ది రోజుల క్రితమే టెలికం కమిషన్ తన గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. కేంద్రం ఇప్పుడు ఫ్లైట్ అండ్ మారిటైమ్ కనెక్టివిటి కోసం అంతర్ మంత్రిత్వ గ్రూపును ఏర్పాటు చేయనుంది. ఈ గ్రూపు విదివిధానాలు ఖరారు చేసిన తర్వాత ఈ కొత్త సౌకర్యం మార్చి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కొత్త ఎయిర్ క్రాఫ్ట్ లు కూడా ఈ సౌకర్యం అందించేందుకు వీలుగా ఆయా విమానాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

టెలికం కమిషన్ తన నిర్ణయాన్ని వెలువరించిన వెంటనే దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ అయిన ఎయిర్ ఇండియా, విస్తారాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో మొబైల్ వాడకంపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటీష్ ఎయిర్ వేస్, ఎయిర్ ఫ్రాన్స్, ఈజిఫ్ట్ ఎయిర్, ఎమిరేట్స్, ఎయిర్ న్యూజిల్యాండ్, మలేషియా ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ వేస్ , వర్జిన్ అట్లాంటిక్ విమానాల్లో ఫోన్ల వాడకాన్ని అనుమతిస్తున్నారు.

Next Story
Share it