Telugu Gateway
Latest News

విడాకుల కోసం 200 కోట్లు చెల్లింపు

విడాకుల కోసం 200 కోట్లు చెల్లింపు
X

అవును. మీరు చదువుతున్నది నిజమే. విడాకుల కోసం ఆయన 200 కోట్ల రూపాయలు కట్టేశారు. కారణాలు ఏమైనా సెలబ్రిటీలు..పారిశ్రామికవేత్తలు విడాకుల కోసం భారీ ఎత్తున భరణాలు చెల్లిస్తూనే ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. అంతర్గత కలహాలతో..రకరకాల సమస్యలతో పెళ్ళితో ఒక్కటైన వారు విడిపోతున్నారు. ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో ఇదో సంచలనం. ఫార్మా రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ సీఎండీ రాజీవ్ మోడీ విడాకుల కోసం తన భార్య మోనికాకు 200 కోట్ల రూపాయల భరణం చెల్లించారు. విడాకులతో వీళ్ళిద్దరి 26 సంవత్సరాల వైవాహిక జీవితానికి తెరపడింది.

గృహ హింస ఆరోపణలతో మోనికా కొన్ని సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయటంతో మోడీ కోర్టు రూమ్ లోనే ఆమెకు 200 కోట్ల రూపాయల డ్రాఫ్ట్ ను అందజేశారు. తొలుత గృహ హింస కింద కేసు పెట్టినా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కు వెళ్లకుండా సెటిల్ చేసుకోవాలని నిర్ణయించుకుని..ఇరువురూ ఓ అంగీకారానికి వచ్చి కోర్టులో విడాకులు పొందారు.

Next Story
Share it