Telugu Gateway
Andhra Pradesh

రెండెకరాల చంద్రబాబుకు లక్షల కోట్లు ఎలా వచ్చాయి?

రెండెకరాల చంద్రబాబుకు లక్షల కోట్లు ఎలా వచ్చాయి?
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి ఆయన మాటల్లోనే...‘మేము నిప్పులాంటి వాళ్ళం. మీరు అవినీతికి వారసులు. రాష్ట్రంలో ఓ మహా నేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్న వారు మీరు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే నా అజెండా.. నాకు సొంత ఎజెండా లేద: రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి. మాఅధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై ఎదురుతిరుగుతున్నాం. మాకు ఎలాంటి సొంత అజెండా లేదు.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కి నాంది పలికింది కేంద్రమే. రాష్ట్రంలో రూలింగ్ లేదు.. ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది. కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయి.

స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా....? మోడీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతొంది. కేంద్రం అమలు పరుస్తున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడా ప్రధాని పేరు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం లేదు. పేద, బడుగు బలహీన వర్గాల ఇళ్లలో ఎల్ ఈడీ కాంతులు నింపింది నరేద్ర మోడీ నే. కరెంటు సమస్యలు తీర్చడానికి 5వేల కోట్ల రూపాయల నిధులు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది అని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. జీవన జ్యోతి పథకం ద్వారా రాష్ట్రంలో లో ఓల్టేజి సమస్య తీర్చింది కూడా మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కాదా?. గతంలో కాంగ్రెస్ రాష్ట్రానికి 9 యూనివర్సిటీ లు ఇస్తే ప్రస్తుతం ఎపి కి 16 యూనివర్సిటీలను కేటాయించిన ఘనత మోడీ ప్రభుత్వానిది కాదా?. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా స్కూల్స్ లో మరుగుదొడ్ల శుభ్రతకు 100 కోట్లు కేటాయించింది మోడీ కాదా?.’ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it