పోర్న్ స్టార్ తో ట్రంప్ రిలేషన్ నిజమే

అవును. పోర్న్ స్టార్ తో ట్రంప్ కు లైంగిక సంబంధం ఉన్న మాట వాస్తవమే. ఎన్నికల ముందు కావాలనే ఈ విషయాన్ని తొక్కిపెట్టాం. దీని కోసం ఆమెకు భారీ మొత్తంలో చెల్లించాం కూడా. ఇప్పుడు తమ రిలేషన్ షిప్ విషయాన్ని బహిర్గతం చేసుకోవచ్చు కూడా. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?. ట్రంప్ వ్యక్తిగత అటార్నీ మైకేల్ కోహెన్. ఓ ఇంటర్యూలో ఈ విషయాలను ఆయన వెల్లడించారు. దీంతో ఇది పెద్ద దుమారంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ట్రంప్ వ్యక్తిగత అటార్నీ మైకేల్ కోహెన్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ‘పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్ తో ట్రంప్ 1,30,000 డాలర్లతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని సంచలన ప్రకటన చేశారు.
‘స్టోర్మీతో చేసుకున్న ట్రంప్ చేసుకున్న ఒప్పందం ప్రలోభానికి గురి చేసేందుకు ఉద్దేశించింది కాదన్నారు. అయితే రాజకీయ విమర్శలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చేసుకుందని తెలిపారు. ఇన్ టచ్ అనే మాగ్జైన్ లో అడల్ట్ సినీతార స్టోర్మీ డేనియల్స్(అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఇంటర్వ్యూను ప్రచురించగా.. వాల్‌స్ట్రీట్ జర్నల్ దానిని యథాతథంగా ప్రచురించింది. అందులో మెలానియా(ట్రంప్ భార్య) బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ధృవీకరించింది.