ఇదే ప్రపంచంలోని అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జి
BY Telugu Gateway25 Dec 2017 1:35 PM IST
Telugu Gateway25 Dec 2017 1:35 PM IST
ఇది ఎక్కడ ఉందో తెలుసా?. చైనాలోని హెబీ ప్రావిన్స్ లో. డిసెంబర్ 24న ఈ అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది 488 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది. రెండు అతి పెద్ద కొండల మధ్య వ్యాలీ కంటే 218 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. రెండు వేల మంది ప్రజలను ఈ బ్రిడ్జి ఆపగలదు.
కాకపోతే ఒకేసారి ఐదు వందల మందిని మాత్రమే అనుమతిస్తారు. అదే సమయంలో బ్రిడ్జి మధ్యకు వెళ్ళాక నడుస్తున్నప్పుడు బ్రిడ్జి కాస్త ఊగుతుంది కూడా. పర్యాటకులకు ఈ బ్రిడ్జి ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వైంజర్స్ ఇష్టపడే వారికి ఈ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.
Next Story