రేవంత్..చంద్రబాబు వదిలిన బాణమే
రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోకి రేవంత్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పంపించారని ఆయన ఆరోపించారు. అందుకు రామలింగారెడ్డి పలు ఉదాహరణలను చెప్పారు. కాంగ్రెస్ లో చేరినా కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబును విమర్శకుండా ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని..దీన్ని బట్టే కాంగ్రెస్ లోకి రేవంత్ ..చంద్రబాబు వదిలిన బాణమే అని అర్థం అయి పోతుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబే ఈ పనిచేశారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మీద కడుతున్న ప్రాజెక్టులు అడ్డుకోవటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవటంతో చివరి అస్త్రంగా రేవంత్‌రెడ్డిని వదిలారన్నారు. తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన రేవంత్, నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనమని ఎంత డబ్బిచ్చాడో గుట్టు విప్పితే తెలంగాణ ప్రజలు ఆయన విశ్వసనీయతను నమ్ముతారని సోలిపేట పేర్కొన్నారు.