కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు
తమిళ సూపర్ స్టార్ కమలహాసన్ రాజకీయవేత్తగా మారేందుకు రెడీ అయిపోయారు. ఆయన ప్రధానంగా బిజెపిని టార్గెట్ చేసేందుకే సిద్ధం అయినట్లు కన్పిస్తోంది. అందులో భాగంగా వామపక్ష భావజాలంతో విమర్శలు మొదలుపెట్టారు. ఆయన గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో హిందూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కమలహాసన్ విమర్శించారు.
అదే సమయంలో కేరళ ఈ విషయంలో ముందంజలో ఉందని ఆయన ప్రశంసించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో బిజెపి ప్రభుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు.కమల్ హసన్ అవినీతిపరుడని ఆయన ద్వజమెత్తారు. త్వరలోనే కమలహాసన్ రాజకీయ పార్టీ ప్రకటించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.