Telugu Gateway
Andhra Pradesh

రఘురామకృష్ణంరాజును రమేష్ ఆస్పత్రికి తరలించండి

రఘురామకృష్ణంరాజును రమేష్ ఆస్పత్రికి తరలించండి
X

సర్కారు అభ్యంతరం

వైసీపీ ఎంపీ రఘురామరామకృష్ణంరాజు వ్యవహారం గంటగంటకో మలుపుతిరుగుతోంది. ఆయన్ను గుంటూరు జైలుకు తరలించగా..జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఎంపీని రమేష్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అంతకు ముందు జిల్లా కోర్టు జీజీహెచ్ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం బాగానే ఉందని..ఆయనకు ఎలాంటి గాయాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. అయితే జిల్లా కోర్టు రమేష్ ఆస్పత్రిలో కూడా పరీక్షలు చేయించాలని ఆదేశించిందని..కానీ సీఐడీ దీన్ని పక్కన పెట్టి జైలుకు తరలించిందని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

అయితే జిల్లా కోర్టు ఆదేశాలను అమలు చేయాలని..రఘురామకృష్ణంరాజును రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. అయితే దీనిపై ఏఏజీ అభ్యంతరం తెలిపారు అంతే కాకుండా రమేష్ ఆస్పత్రికి తరలించటం అంటే టీడీపీకి ఆపీసుకు తీసుకెళ్లినట్లేనని వ్యాఖ్యానించారు. రమేష్ ఆస్పత్రి,పై క్రిమినల్ కేసులు ఉన్నాయని...ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల పది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అయితే ఇదే అంశాలతో పిటీషన్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే తన భర్తకు ప్రాణహాని ఉందని రఘురామకృష్ణంరాజు భార్య ఆరోపించారు.

Next Story
Share it