Telugu Gateway
Top Stories

హెచ్ 1 బీ వీసాల లాటరీ పద్దతికి స్వస్తి !

హెచ్ 1 బీ వీసాల లాటరీ పద్దతికి స్వస్తి !
X

ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి ఆయన నినాదం అమెరికా ఫస్ట్. దేశంలో ఉద్యోగాలు తొలుత అమెరికన్లకే దక్కాలని..తర్వాత ఎవరైనా అని చెబుతూ వస్తున్నారు. అదే ఆయనకు అమెరికాలో ఓ రేంజ్ లో క్రేజ్, ఫాలోయర్లను తెచ్చిపెట్టింది. కార్పొరేట్ దిగ్గజాలు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా అమెరికన్లు మాత్రం ట్రంప్ కు అండగా నిలుస్తున్నారు. దేశంలోకి కేవలం అత్యంత నైపుణ్యం ఉండి..అధిక వేతనాలకు అర్హులైన వారిని మాత్రమే రప్పించాలని ఆయన వాదన. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ ఐటి నిపుణులకు నష్టం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ట్రంప్ తాజాగా హెచ్ 1 బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్దతికి గుడ్ బై చెబుతూ మరో కీలక ప్రతిపాదన చేశారు. దీనిvస్థానంలో వేతన స్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందన తెలియజేయవచ్చుని అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ(డిహెచ్‌ఎస్‌) తెలిపింది.

లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలను అందించేలా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రంప్‌ సర్కార్ ప్రకటించింది. భారత్ సహా, వివిధ దేశాలనుంచి ప్రతీ ఏడాది హెచ్‌ 1బీ వీసా కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉంటాయి. వీటిలో కంప్యూటర్‌ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పద్దతిలో విదేశాలకు చెందిన అభ్యర్ధులు చౌకగా దొరుకుతుండడంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందంటూ ట్రంప్‌ సర్కార్‌ వాదిస్తోంది. దీనికి బదులుగా ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్‌1బీ వీసాను జారీచేసేలా చర్యలు చేపట్టనుంది.

Next Story
Share it