Telugu Gateway
Top Stories

వైరల్ గా మారిన ఫోటోలు

వైరల్ గా మారిన ఫోటోలు
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన నిర్ణయాలు...తీసుకుంటున్న చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒక వైపు తన మాట వినని ప్రపంచ దేశాలను సుంకాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తూనే...నోబెల్ శాంతి పురస్కారం పొందాలని కలలు కంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఇండియా-పాకిస్థాన్ యుద్దాన్ని కూడా తానే ఆపానని డోనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఇండియా ఈ వాదనను తోసిపుచ్చిన సరే ట్రంప్ మాత్రం ఈ పాట వీడలేదు. ఇప్పుడు మరో సారి అయన వార్తల్లో నిలిచారు. దీనికి కారణం అమెరికాలోని కాపిటల్ భవనం ఎదురుగా డోనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహం కొలువు తీరింది. అంతే కాదు ఈ ట్రంప్ విగ్రహం చేతిలో క్రిప్టో కరెన్సీ కాయిన్ కు ఉంది. ఈ ట్రంప్ విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తులో ఉంది. ఇప్పుడు ఈ ఫోటో, వార్త వైరల్ గా మారింది. కాపిటల్ ఎదురుగా డోనాల్డ్ ట్రంప్ విగ్రహం ఏర్పాటుపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది దీన్ని స్వాగతిస్తుంటే..మరి కొంత మంది విమర్శిస్తున్నారు.

క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం కోసం నిధులు సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా అమెరికా ఫెడ్ చీఫ్ జెరోం పావెల్ ...డోనాల్డ్ ట్రంప్ ల మధ్య కూడా వివాదం సాగుతోంది. ఎప్పటి నుంచో అయన వడ్డీ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు. అయితే ఫెడ్ చీఫ్ మాత్రం అన్ని విషయాలని పరిశీలించిన తర్వాత మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటాం అని చెపుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిపిన సమీక్షలో మాత్రం ఫెడ్ 0. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించింది. కాపిటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన విగ్రహం చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. డోనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా క్రిప్టో కరెన్సీ అనుకూల విధానాలను అవలంబిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it