Telugu Gateway
Top Stories

ధరణిపై అంతా అయిపోయాక హైకోర్టు కీలక ఆదేశాలు

ధరణిపై అంతా అయిపోయాక హైకోర్టు కీలక ఆదేశాలు
X

వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు బ్రేక్

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ధరణి పోర్టల్'కు హైకోర్టు బ్రేక్ వేసింది. ముఖ్యంగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదుపై స్టే విధించింది. విచిత్రం ఏమిటంటే తెలంగాణ సర్కారు పలుమార్లు గడువు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 70 నుంచి 80 శాతంపైగా నమోదు చేశారు. ధరణి పోర్టల్ పై హైకోర్టులో కేసు నమోదు అయిన తర్వాతే తెలంగాణ సర్కారు వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు గడువులేదని మాట మార్చింది. అప్పటికే చాలా మంది తమ వివరాలు ఇఛ్చేశారు కూడా. మంగళవారం నాడు ధరణి పోర్టల్ కు సంబంధించిన అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు నాన్ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూములు వివరాలు నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని హైకోర్టు పేర్కొంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ధరణి పోర్టల్‌ను పోలిన మరో నాలుగు యాప్స్‌ ఉన్నాయని హైకోర్టు తెలిపింది. దీంతో అసలు ధరణి పోర్టల్‌ ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీలకు సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాని హైకోర్టు కోరింది. రెండు వారాల్లో కౌంటర్‌ ద్వారా పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.అప్పటివరకూ ఎలాంటి నమోదు చేయకూడదని సూచించింది. ప్రజల నుంచి వివరాలు నమోదు చేయడంలో బలవంతం చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఏ చట్టం ప్రకారం ఈ వివరాలు సేకరిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి చట్టబద్ధతతోపాటు సమగ్ర వివరాలు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.

Next Story
Share it