Telugu Gateway
Top Stories

సునామీ వచ్చినట్లు ఈ గగ్గోలు ఏంటి?

సునామీ వచ్చినట్లు ఈ గగ్గోలు ఏంటి?
X

గీతం యూనివర్శిటీ విషయంలో తెలుగుదేశం నేతల తీరును ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుపట్టారు. ఏదో సునామీ వచ్చినట్లు ఈ గగ్గోలు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి గీతం యూనివర్శిటీ యాజమాన్యంపై ఎలాంటి ప్రేమలేదని..కేవలం రాజకీయం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా అంత ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నప్పుడే రెగ్యులరైజ్ చేసి ఉండేవారన్నారు. పార్టీలకు అతీతంగా భూ ఆక్రమణలు తొలగించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' అక్రమ భూములు స్వాధీనం చేసుకుంటే టీడీపీ నాయకుల విమర్శలు సరికాదన్నారు.

రుషికొండలో ఎకరం భూమి 20 కోట్ల రూపాయలు ఉంది. 40 ఎకరాలు అంటే 800 కోట్ల రూపాయలు. ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబుకి అమరావతి ఉంటే చాలు. గీతం చారిటీ సంస్థ కాదు.. సీట్ల కోసం లక్షలు వసూలు చేస్తున్నారు. రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ పాటించరు. గీతం యాజమాన్యం స్థానిక రుషికొండ.. ఎందాడ ప్రజలకు ఎప్పుడైనా ఫీజు తగ్గించి ఇచ్చారా? గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై చర్యల విషయంలో టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు వెనక్కి తీసుకోవాలన్నారు.

Next Story
Share it