Telugu Gateway
Top Stories

స్విగ్గీ ఐపీవో ధరల శ్రేణి ఫిక్స్

స్విగ్గీ ఐపీవో ధరల శ్రేణి ఫిక్స్
X

మరో బిగ్ ఐపీవో కి రంగం సిద్ధం అయింది. ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ కంపెనీ అయిన స్విగ్గీ తన షేర్ల ధరలను నిర్ణయించింది. ఐపీవో కోసం షేర్ ధరల శ్రేణిని 371 -390 రూపాయలుగా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. కంపెనీ అధికారికంగా ఈ విషయాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. స్విగ్గీ ఐపీవో నవంబర్ ఆరు న మొదలై...ఎనిమిదిన ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ ఏకంగా 11300 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఇందులో 6800 కోట్ల రూపాయల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద...మరో 4500 కోట్ల రూపాయలకు ఫ్రెష్ షేర్లను జారీ చేయనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే షేర్ల మొత్తం ప్రమోటర్ల ఖాతాల్లోకి వెళతాయి. కొత్త షేర్ల జారీ నిధులు మాత్రం కంపెనీ ఖాతాలోకి వస్తాయి. ఈ నెలలో హ్యుండయ్ మోటార్ ఇండియా తర్వాత అతి పెద్ద ఐపీవో అంటే స్విగ్గీ దే అని చెప్పాలి.

మార్కెట్ లో స్విగ్గీ ఐపీవో పై మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. గత కొన్ని రోజులుగా వరుసగా పతనం అయిన మార్కెట్ లు సోమవారం నాడు బౌన్స్ బ్యాక్ అవటం కూడా ఈ కంపెనీ కి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. మూరత్ ట్రేడింగ్ తర్వాత మార్కెట్ సెంటిమెంట్ మారుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. బ్రాండ్ పరంగా ఎంతో పేరున్న హ్యుండయ్ మోటార్ ఇండియా తో పాటు షాపుర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ అయిన అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవో కి కూడా స్పందన ఏమంత ఆశాజనంగా లేనట్లు గణాంకాలు చెపుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న బజ్ ప్రకారం చూస్తే స్విగ్గీ ఐపీవో సక్సెస్ కావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు చెపుతున్నారు.

Next Story
Share it