Telugu Gateway
Top Stories

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం ఓకే

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం ఓకే
X

మోడీ సర్కారు అత్యంత ప్రతిష్టాతక్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అన్నీ నిబంధనల ప్రకారమే సాగుతున్నాయని, ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు కన్పించటం లేదని కోర్టు పేర్కొంది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపు అంతా సవ్యంగా సాగాయని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అన్నింటిని విచారించిన సుప్రీం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పలు సూచనలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నియంత్రించే స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాలను హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి అవసరం అని..వెంటనే అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది.

Next Story
Share it