Telugu Gateway
Top Stories

వ్యాక్సిన్లు బయలుదేరాయి

వ్యాక్సిన్లు బయలుదేరాయి
X

దేశంలో ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలుత దేశంలో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా అభివృద్ధ చేసిన 'కోవిషీల్డ్' వ్యాక్సిన్ ను ఉపయోగించనున్నారు. దేశంలో పూణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) లో ఉత్పత్తి చేస్తున్న విషయం విదితమే. అందుకే దేశంలోని పలు రాష్ట్రాలకు పూణే నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ల రవాణా మంగళవారం ఉదయమే ప్రారంభం అయింది. స్పైస్ జెట్ కు సంబంధించి విమానం ఒకటి తొలి వ్యాక్సిన్ డోస్ ల కు చెందిన 34 బాక్స్ లను ఢిల్లీకి వెళ్లింది. ఈ బాక్స్ ల బరువు 1088 కేజీలుగా ఉందని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

దీంతో ఎనిమిది వాణిజ్య విమానాలు, రెండు కార్గో విమానాల ద్వారా పూణే నుంచి వ్యాక్సిన్ ను హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్ , కోల్ కతా, గౌహతిలకు పంపుతున్నారు. పూణె నుంచి కోవిషీల్డ్‌ టీకాలు మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. మొత్తం 4.7 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే 19 వాహనాలలో రేపు (జనవరి 13) అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్‌ పాయింట్లకు తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్‌ డెలివరీ వాహనాల్లో ఏర్పాట్లు చేశారు.

Next Story
Share it