Telugu Gateway
Top Stories

షాకింగ్...ప్యారిస్ లో 700 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

షాకింగ్...ప్యారిస్ లో 700 కిలోమీటర్ల  ట్రాఫిక్ జామ్
X

మనం ఓ పది కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితేనే విలవిల్లాడిపోతాం. కానీ ఇప్పుడు అక్కడ ఏకంగా 700 మీటర్ల మేర జామ్ అయింది. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. కరోనాకు సంబంధించి ఇప్పుడు పదే పదే విన్పిస్తున్న 'సెకండ్ వేవ్.'. కరోనా ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల తగ్గినట్లే తగ్గి మళ్ళీ విభృభిస్తోంది. దీంతో ప్యారిస్ లో మరోసారి లాక్ డౌన్ విధించారు. దీంతో పారిస్ వాస్ లు అందరూ తమ వాహనాలను బయటకు తీసి.. ఆ దేశం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళారు. కరోనా వైరస్ కారణంగా మరోసారి తాము ఇరుకుగా ఉండే ఇళ్ళలో బందీలుగా మారటానికి సిద్ధంగా లేమని..అందుకే నగరం వెలుపలకు బయలుదేరినట్లు చెబుతున్నారు. శుక్రవారం నుంచి ప్యారిస్ లో మళ్ళీ లాక్ డౌన్ ను ప్రకటించారు. ప్యారిస్ వాసులు ఇంతలా బయటకు వెళ్ళటానికి మరో ప్రధాన కారణం లాంగ్ వీకెండ్ కూడా అని చెబుతున్నారు.

మళ్ళీ లాక్ డౌన్ విధింపుతో నిత్యావసర వస్తువుల షాపులు, మార్కెట్లు జనంతో నిండిపోయాయి. ప్యారిస్ లోని 67 మిలియన్ల మందిని ఇళ్ళలోనే ఉండాలని ప్రభుత్వం కోరింది. ఎలాంటి సందర్శకులను అనుమతించవద్దని ఆదేశించారు. ఎవరైనా సందర్శకులను అనుమతిస్తే భారీ జరిమానాలతో ఇతర శిక్ష్లులు కూడా విధించనున్నారు. దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ లాక్ డౌన్ మార్గాన్ని ఎంచుకున్నారు.

Next Story
Share it