Telugu Gateway
Top Stories

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
X

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ అడ్డుకోవటమే. ఇటీవల శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాద ఘటనకు వెళితే అదే జరిగింది. ఇప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు మునిగిన అంశాన్ని పరిశీలించటానికి వెళ్ళిన రేవంత్ రెడ్డికి మళ్లీ అదే పరిస్థితి. సీనియర్ నేత మల్లు రవితో కలసి రేవంత్ రెడ్డి కల్వకుర్తి ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకోవటంతో నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి లో టెన్షన్ నెలకొంది. నీట మునిగిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సర్జిపుల్ చూడటానికి ఎంపీ రేవంత్ రెడ్డి బయలుదేరారు. పోలీసుల తీరుతో రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తెల్కపల్లిలో ఉద్రిక్తత కొనసాగింది. ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల శుక్రవారం నాడు పంపులు బ్లాస్ట్ అయ్యాయి.

సీఎం కేసీఆర్ పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కల్వకుర్తికి 400 మీటర్ల దూరంలో పాలమూరు- రంగారెడ్డి చేపడితే ప్రమాదం ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని 2016 జూన్ 20న ఎక్స్‌ పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. తాము ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పిన కేసీఆర్ పెడచెవిన పెట్టారని విమర్శించారు. మీరు కట్టే ప్రాజెక్టులకు నీళ్లు రావు. జేబుల్లోకి కమీషన్లు మాత్రమే వెళ్తాయన్నారు. కల్వకుర్తి ప్రమాదానికి బాధ్యత ఎవరిది..? ఇరిగేషన్ శాఖ సీఎం వద్దే ఉంది. వేల కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. దీని మీద జ్యుడిషియరీ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

Next Story
Share it