Telugu Gateway
Top Stories

'రెడ్ మీ' 10 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్

రెడ్ మీ  10 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్
X

కొత్త సంవత్సరం. కొత్త సిరీస్. రెడ్ మీ ఈ ఏడాది మూడు కొత్త ఫోన్లతో మార్కెట్లోకి వచ్చేసింది. రెడ్ మీ 10 సిరీస్ పేరుతో ఈ ఫోన్లను దేశీయ మార్కెట్లో విడుదల చేశారు. బడ్జెట్ ధరలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫోన్లను విడుదల చేయటంలో రెడ్ మీ ముందు వరసలో ఉంటుంది. త్వరలోనే ఇవి ఆన్ లైన్ ద్వారా కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. చైనా మొబైల్‌ దిగ్గజం షావోమి రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్లు లాంచ్‌ చేసింది.

రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌ ఫోన్ల ధరలు రూ .11,999, రెడ్‌మి నోట్ 10 ప్రో రూ .15,999 , ప్రో మాక్స్ రూ .18,999 వద్ద ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన 8 జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్‌ వెర్షన్‌ రెడ్‌మీ నోట్ 10 ప్రో మాక్స్ వేరియంట్‌ ధర రూ .21,999 గా కంపెనీ నిర్ణయించింది. రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్‌ లో శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌ఎం2 108 ఎంపీ, 5 ఎంపి సూపర్ మాక్రో కెమెరాలను వెనుక భాగంలో అమర్చడం ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్: అమ్మకం మార్చి 18

6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ధర రూ .18,999

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ధర రూ .19,999

8 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ధర రూ .21,999

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ఫీచర్లు

6.67అంగుళాల డిస్‌ప్లే

ఆండ్రాయిడ్‌ 11

1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌

732 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

16ఎంపీ సెల్ఫీ కెమెరా

108+ 8+ 5+2 ఎంపీ రియర్‌ కెమెరా

5020 ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్‌మి నోట్ 10 ప్రో: అమ్మకం మార్చి 17

6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ‌ధర రూ .15,999

6 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ ధర రూ .16,999

8 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ ధర రూ .18,999

రెడ్‌మి నోట్ 10 ప్రో ఫీచర్లు

6.67 అంగుళాల డిస్‌ప్లే

ఆండ్రాయిడ్‌ 11

732 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

16 ఎంపీ సెల్ఫీ కెమెరా

64+ 8+ 5+ 2 ఎంపీ రియర్‌ కెమెరా

5050 ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్‌మి నోట్‌ 10 ఫీచర్లు

6.43 అంగుళాల డిస్‌ప్లే

678 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

ఆండ్రాయిడ్‌ 11

1080x2400 పిక్సెల్స్‌ రిజ్యలూషన్‌

13 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా

48+8+2+2 ఎంపీ రియర్‌ కెమెరా

5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Next Story
Share it