ఫిబ్రవరి 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ ఓపెన్
కరోనా భయాలు తొలగిపోతున్నాయి. అంతా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సందడి కూడా ప్రారంభం అయింది. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కూడా అదే దిశలో రెడీ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటక కేంద్రంగానే కాకుండా బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ సహా పలు భాషల సినిమా నిర్మాణాలకు ఇది కేంద్రంగా విరాజిల్లుతోంది. కరోనా కారణంగా కారణంగా పర్యాటకులను అనుమతించటం నిలిపివేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతోపాటు వేసవి పర్యాటక సీజన్ వస్తుండటంతో రామోజీ ఫిల్మ్ సిటీ గేట్లు పర్యాటకుల కోసం తెరవాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలోకి పర్యాటకులను అనుమతించనున్నారు. ఎప్పటిలాగానే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు వినోద కార్యక్రమాలు, ఆకర్షణీమైన లైవ్ షోలు, సినిమా షూటింగ్ సెట్లలో కూడా పర్యాటకులను అనుమతించనున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పర్యాటకులను అనుమతించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా వరకూ పర్యాటక కేంద్రాలు ఓపెన్ అయ్యాయి.