Telugu Gateway

కెసీఆర్, జగన్ లకు మోడీ ఫోన్

కెసీఆర్, జగన్ లకు మోడీ ఫోన్
X

ప్రధాని నరేంద్రమోడీ బుధవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. వర్షాలు, వరదలు వల్ల ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఆరా తీశారు. ఏపీలోని పలు ప్రాంతాలు వరద తాకిడికి తీవ్ర ఇబ్బందుల పాలు కాగా, తెలంగాణలో హైదరాబాద్ నగరం జల విలయంతో తీవ్ర ఇబ్బందుల పాలైంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా రావటంతో ప్రధాని మోడీ కూడా స్పందించారు. అనంతరం ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.

భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని ఉద్దేశించి తెలంగాణ సీఎం కెసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వర్ష బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎంలు ఇద్దరూ తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితిని ప్రధాని మోడీకి వివరించారు. ఈ వర్షాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు.

Next Story
Share it