Telugu Gateway
Top Stories

బ్యాంకు షేర్లు నిలబెట్టాయి

బ్యాంకు షేర్లు నిలబెట్టాయి
X

స్టాక్ మార్కెట్ లు బుధవారం నాడు అంతా ఊగిసలాడాయి. కానీ చివరకు లాభాలతోనే ముగిశాయి. ఐటి షేర్లు సెన్సెక్స్ తగ్గటానికి కారణం అయితే..బ్యాంకు షేర్లు సెన్సెక్స్ క్లోజింగ్ లో లాభాలతో ముగియటానికి దోహదపడ్డాయి. చివరకు బిఎస్ఈ సెన్సెక్స్ 256 పాయింట్ల లాభంతో 85,170 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం నాడు ప్రధానంగా యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సి బ్యాంకు , పవర్ గ్రిడ్, ఎన్ టిపీసి షేర్లు లాభాల్లోకి రావటం సెన్సెక్స్ పెరగటానికి కారణం అయింది. అంతే కాదు..అటు బిఎస్ఈ సెన్సెక్స్ తో పాటు ఎన్ ఎస్ ఈ నిఫ్టీ లు కూడా కొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల వద్ద ఉండటం కూడా సానుకూల అంశంగా ఉంది.

గత కొన్ని రోజులుగా వరసగా లాభాల బాటలో సాగిన స్పైస్ జెట్ షేర్లు బుధవారం కూడా తగ్గాయి. స్పైస్ జెట్ షేర్ మూడున్నర రూపాయల నష్టంతో 62 రూపాయల వద్ద ముగిసింది. దీంతో పాటు మార్కెట్ లో ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేర్ బుధవారం నాడు భారీగా పతనం అయింది. బ్లాక్ డీల్ ద్వారా ప్రమోటర్ల లో ఒకరు షేర్లు విక్రయించటంతో ఈ స్క్రిప్ భారీ నష్టాలను చవిచూసింది. ఒక దశలో 20 శాతం మేర నష్టపోయిన ఈ షేర్ చివరకు ఏడు రూపాయల నష్టంతో 34 రూపాయల వద్ద ముగిసింది. బుధవారం నాడే ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేర్లు 6.20 కోట్లు చేతులు మారాయి.

Next Story
Share it